పటాన్‌చేరు డైలీ రిపోర్ట్:
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది.2023 ఎన్నికల అఫీడఫీడ్ లో తప్పుడు వివరాలు సమర్పించడంతో పాటు ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రత్యర్థి అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విధితమే.ఎన్నికల్లో అవినీతి కార్యకలాపాలు చేసి ఓటర్లను ప్రభావితం చేసి గెలుపొందిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాట దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్నారు.పిటీషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు మహిపాల్ రెడ్డికి బిగ్ రిలీఫ్ ఇచ్చింది.ఎమ్మెల్యే పై సరైన ఆధారాలు లేనందున పిటిషన్ కొట్టి వేసింది.హైకోర్టులో న్యాయవాది నవీన్ కుమార్ వాదనలు తెలుపుతూ వాస్తవాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 ప్రకారం శ్రీనివాస్ గౌడ్ దాఖలు చేసిన పిటీషన్ విరుద్ధమన్న అడ్వకేట్ నవీన్ కుమార్ వాదనలతో న్యాయమూర్తి కే.శరత్ ఏకీభవించి ఎన్నికల పిటిషన్ రద్దు చేశారు.దీనితో పటాన్‌చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది.దీనిపై ఆయన శ్రేణులు అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.









