– ప్రభుత్వ భూమితో పాటు.. పార్కులకు కబ్జాల నుంచి విముక్తి మణికొండ మున్సిపాలిటీలో దశాబ్దాలుగా కబ్జాల చెరలో చిక్కుకుపోయిని ప్రభుత్వ భూమితో పాటు పార్కులకు శనివారం హైడ్రా విముక్తి కల్పించింది. దాదాపు రూ. 300ల కోట్ల విలువైన భూమిని కాపాడింది. ఇందులో ఒక ఎకరం ప్రభుత్వ భూమి కాగా.. 7650 గజాల పార్కు స్థలాలున్నాయి. వీటికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మణికొండలోని పంచవటి కాలనీలో వెస్టర్న్ ప్లాజాకు చేరువలో ఉన్న 1 ఎకరా భూమికి ఎలాంటి పత్రాలు లేకుండా తమ పూర్వీకులదని చెప్పి కబ్జా చేసిన వారిని హైడ్రా శనివారం ఖాళీ చేయించింది. ప్రభుత్వ భూమిలో కబ్జాదారులు తిష్ట వేసారంటూ వెస్టర్న్ ప్లాజాకు చెందిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారి ఆదేశాలతో హైడ్రా అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. క్షేత్ర స్థాయిలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పరిశీలించి ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు. శనివారం ఆక్రమణలను తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేశారు. దీని విలువ దాదాపు రూ. 155 లక్షలు ఉంటుందని స్థానిక అధికారులు అంచనా వేశారు.









