మణుగూరులో బీఆర్ఎస్ ఆఫీసుపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి, నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత

మణుగూరు డైలీ రిపోర్ట్ ;మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయంపై పక్కా ప్రణాళిక తోనే, ప్రభుత్వ పెద్దల అండతోనే ఈ దాడి జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి ఈ దాడి అద్దం పడుతుంది. భద్రాద్రి రాముడున్న కొత్తగూడెం ను కాంగ్రెస్ రాజ్యం రావణ కష్టంగా మారుస్తుందని రాకేష్ రెడ్డి విమర్శించారు. ఆ సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉంటే హత్య చేసేవారే అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతను బొంకి, బొర్లించి ఎన్నికలు అయిపోగానే బోల్తా కొట్టారు. ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ ఇలా నోటికొచ్చిన హామీ ఇచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. మావల్ల మీకు ఉద్యోగాలు వచ్చాయి. మరి, మా ఉద్యోగాల సంగతి ఏంటని ప్రశ్నిస్తే, ఇన్నాళ్లు అక్రమ కేసులు పెట్టారు. ఇప్పుడు ఏకంగా భౌతిక దాడులకే తెగబడుతున్నారు. ఇది ప్రజా పాలన కాదు, ప్రతీకార పాలన, పైశాచిక పాలన అన్నారు.

2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమి లేక, అక్రమ కేసులు, బెదిరింపులు, దాడులనే నమ్ముకున్నారు. ఆఖరికి అభ్యర్థి సైతం బాధ్యత మరిచి ఉరికించి కొడతాం. రోడ్ల మీద తిరగనీయం అని బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి అన్నం పెట్టినోళ్ళకు సున్నం పెట్టడం వెన్నతో పెట్టిన విద్య. నాడు మార్పు పేరుతో మీ గెలుపు కృషి చేసిన చేతులకే నేడు మీరు సంకెళ్ళు వేస్తున్నారు. రేపు అవే గొంతులు ఏకమై మీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తాయన్నారు.

అభివృద్ధి చేయలేకనే ఈ అసహనం. అరాచకాలతో, దారులతో, హింసతో అధికారాన్ని కొనసాగించలేరు. జూబ్లిహిల్స్ దెబ్బతోనే మీ పతనం ఖాయం. ఈ రోజు మీరు దాడి చేసిన ఆ నిరుద్యోగ యువతే జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల కాంగ్రెస్ ను బొందపెట్టి విజయోత్సవ ర్యాలీ చేస్తారని హెచ్చరించారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :