జూబ్లీహిల్స్ డైలీ రిపోర్ట్ ;
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav)పై కేసు నమోదైంది. బీఆర్ఎస్ (BRS) నాయకుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మరో తొమ్మిది రోజుల్లో జరగనుంది. ఈ ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలో ప్రచారంలో దూసుకు పోతున్నాయి. అయితే ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు సైతం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ క్యాడర్‌ను లేకుండా చేస్తానంటూ ఇటీవల కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. నవీన్ యాదవ్‌తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు బోరబండ పీఎస్ (Borabanda Police Station)లో ఫిర్యాదు చేయడంతో మూడు కేసులు నమోదు అయ్యాయి.









