కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్, నవంబరు2 (డైలీ రిపోర్ట్ ): కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt)పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(ఆదివారం) బీజేపీ కార్యాలయంలో మీడియాతో కిషన్‌రెడ్డి మాట్లాడారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ కుట్రలు చేస్తోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఎంఐఎం ఓట్ల కోసమే బీజేపీపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. తాయిలాలతో ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్‌ యత్నిస్తోందని ఆరోపించారు. సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలు బెదిరింపు ధోరణితో ఉన్నాయని ఆక్షేపించారు. ప్రజలను మభ్యపెట్టాలని కాంగ్రెస్‌ చూస్తోందని ఫైర్ అయ్యారు.ఓట్లు వేయకపోతే పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో ఓడిపోతామనే భయంతోనే సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం సీఎం రేవంత్‌‌రెడ్డికి పట్టుకుందని ఎద్దేవా చేశారు. సన్నబియ్యం పథకాన్ని దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తోందని ఉద్ఘాటించారు. సన్నబియ్యం తామే ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌‌రెడ్డి ఎలా మాట్లాడుతున్నారని కిషన్‌రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :