శాసనమండలి బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా సోము వీర్రాజు ఎంపిక

డైలీ రిపోర్ట్ ,ఏపీ ;ఏపీ శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా ఎమ్మెల్సీ సోము వీర్రాజును ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో భాగంగా బీజేపీకి ఒక సీటును కూటమి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఈ పదవికి బీజేపీ సీనియర్ నేత పీవీఎన్ మాధవ్‌ను ఎంపిక చేస్తారంటూ ఒక ప్రచారం అయితే తొలుత ఊపందుకుంది. కానీ చివరి నిమిషంలో సోము వీర్రాజు పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. దీంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా సోము వీర్రాజు ఎన్నికయ్యారు. ఇక శాసన మండలిలో వైసీపీ, టీడీపీకి ఫ్లోర్ లీడర్లు ఉన్నారు. కానీ బీజేపీకి లేరు. దీంతో ఈ పదవికి సోము వీర్రాజును తాజాగా ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :