చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన

డైలీ రిపోర్ట్ ,క్రీడలు ;

మహిళల ప్రపంచ కప్ 2025(Women’s World Cup) ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా స్టార్ బ్యాటర్‌ స్మృతి మంధాన (Smriti Mandhana) సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఓ సింగిల్‌ వరల్డ్‌ కప్‌ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్ గా ఆమె చరిత్ర సృష్టించింది. నేడు(ఆదివారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్లో (India vs South Africa) మంధాన ఈ అరుదైన ఘనత సాధించింది. గతంలో ఈ రికార్డు మిథాలి రాజ్‌(Mithali Raj) పేరిట ఉండేది. మిథాలీ 2017 ఎడిషన్‌లో 409 పరుగులు చేయగా.. 2025 ఎడిషన్‌లో స్మృతి 418 పరుగులతో టాప్ ప్లేస్ లో ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :