పటాన్చెరు,డైలీ రిపోర్ట్
పటాన్చెరువులోని తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఉన్న కొల్లూరు 2BHK కాలనీని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, తెలంగాణ రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఎండి గౌతమ్ ఆదివారం సందర్శించారు. సీఎస్‌ఆర్ నిధులతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఉన్నత పాఠశాల, పార్క్ స్థలాలను పరిశీలించారు. ఈ పనులకు సోమవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, వివేక్‌లు శంకుస్థాపన చేయనున్నారు.
కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించి, మంత్రుల పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. లబ్ధిదారులతో సమావేశమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ చలపతిరావు, డిఇఓ వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Post Views: 62









