- ప్రయాణికుల ఆర్తనాదాలతో హృదయవిదారక వాతావరణం
- సహాయచర్యలో పాల్గొన్న చేవెళ్ల సీఐ భూపాల్ శ్రీధర్‌కు గాయాలు
- సీఐ కాళ్లపైకి జీసీబీ ఎక్కడంతో గాయాలు, చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన బస్సు కండక్టర్ రాధ
- ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు
- చేవెళ్ల మం. మీర్జాగూడ వద్ద బస్సును ఢీకొట్టిన కంకర లారీ
- ప్రయాణికుల ఆర్తనాదాలతో హృదయవిదారక వాతావరణం
- ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు
- హైదరాబాద్-బీజాపూర్ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం
- తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సును ఢీకొన్న కంకర లారీ
- లారీలో ఉన్న కంకర పడడంతో బస్సులో కూరుకుపోయిన ప్రయాణికులు
రంగారెడ్డి బ్యూరో రవీంద్ర 03 సోమవారం 2025 : డైలీ రిపోర్ట్; రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో తాండూరు ఆర్టీసీ డిపోనకు చెందిన ఈ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు : బస్సుపై కంకరలోడు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్ -బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన సీఎం
- తక్షణం ఘటనాస్థలికి వెళ్లి సహాయచర్యలు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశం
- సహాయ చర్యలు ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన సీఎం
- ప్రమాద వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని సీఎం ఆదేశం
- క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎస్, డీజీపీకి ఆదేశం
- క్షతగాత్రులను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- అందుబాటులో ఉన్న మంత్రులు ఘటనాస్థలికి వెళ్లి పర్యవేక్షించాలని ఆదేశం
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
- ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తో, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడారు.
- కంకర లోడు తో ఉన్న టిప్పర్ రోడ్డు రాంగ్ రూట్లో వచ్చి బస్సు ను ఢీకొట్టినట్టు అధికారులు తెలిపారు.
- హుటాహుటిన ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
Post Views: 141









