స్టేట్ బ్యూరో ,డైలీ రిపోర్ట్ ;
చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ పరిహారం : మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాల అప్పగింతకు అధికారులను కేటాయించామన్నారు.
Post Views: 32









