మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్‌‌లో బిగ్ ట్విస్ట్

విజయవాడ ,డైలీ రిపోర్ట్ ;మావోయిస్టు అగ్రనేత హిడ్మా (Maoist Leader Hidma) ఎన్‌కౌంటర్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసులకు హిడ్మా రాసినట్లు ఓ లేఖ ప్రస్తుతం సంచలనం రేపుతోంది. తాను పోలీసులకు లొంగిపోవాలనుకున్నానని హిడ్మా చెప్పినట్లు తెలుస్తోంది. తన ఆలోచనలు, నిర్ణయాలపై బస్తర్‌లోని ఓ జర్నలిస్ట్‌కు హిడ్మా లేఖ రాసినట్లు సమాచారం. నవంబర్ 10వ తేదీన జర్నలిస్టుకు లేఖ రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ లేఖలో ఏముందంటే..

‘నా ఆయుధాలు విడిచి పెట్టాలని నేను ఆలోచిస్తున్నాను. నేను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని అనుకుంటున్నాను. నేను ఎక్కడ లొంగిపోవాలన్నది కమిటీతో మాట్లాడి నిర్ణయించాల్సి ఉంది. మా భద్రతకు పోలీసులు హామీ ఇస్తే లొంగిపోయేందుకు సిద్ధం. త్వరలో హిందీతో పాటు తెలుగులోనూ ఆడియో మెసేజ్ పంపుతాం. ఆయుధాలు విడిచే ముందు కొన్ని అంశాలపై చర్చించాల్సి ఉంది’ అని హిడ్మా పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది.

అయితే, నిన్న(మంగళవారం) మారేడుమిల్లిలో ఏపీ పోలీసులు పలువురు మావోయిస్ట్ అగ్రనేతలను ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌లోనే హిడ్మా మరణించారు. ఈ క్రమంలోనే విజయవాడ, ఏలూరు, కాకినాడ, తదితర ప్రాంతాల్లో మావోయిస్టులు భారీ స్థాయిలో పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ ఇప్పటివరకు స్పందించలేదు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :