ఇంద్రకరణ్ లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం…

కేసీఆర్‌పై సిట్ విచారణను ఖండిస్తూ

బీఆర్ఎస్ నాయకుల శాంతియుత నిరసన

సంగారెడ్డి బ్యూరో డైలీ రిపోర్ట్ ఫిబ్రవరి 1;

పరిపాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపులే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను తీవ్రంగా ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఇంద్రకరణ్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు ఇంద్రకరణ్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు గ్రామ అధ్యక్షులు బచ్చుగూడెం వెంకటేష్ మాట్లాడుతూ...

కేసీఆర్‌ పై కొనసాగుతున్న ఎస్‌ఐటీ విచారణ పూర్తిగా రాజకీయ కక్షసాధింపు చర్యగా మారిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విచారణను ఆయుధంగా మలుచుకుంటోందని విమర్శించారు.

మాజీ ఎంపీటీసీ చంద్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుని, ఆధారం లేని ఆరోపణలతో వేధింపులకు గురి చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చు కునే ప్రయత్నం చేస్తోందని వారు అన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని ఆయన స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో ఇంద్రకరణ్ గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షులు బచ్చుగూడెం వెంకటేష్ నాయకత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ నాయకులు, యువ నాయకులు కలిసి నిరసనకు సంఘీభావం తెలిపారు.నిరసన కార్యక్రమం ముగిసిన అనంతరం డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. కేసీఆర్‌పై కొనసాగుతున్న ఎస్‌ఐటీ విచారణను తక్షణమే నిలిపివేయాలని, ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగ విలువలను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఇంద్రకరణ్ గ్రామ బీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ సర్వాని వెంకటేష్, మాజీ అధ్యక్షులు పుర్ర మహిపాల్, మాజీ ఎంపీటీసీ చంద్రీ శ్రీనివాస్, కొండా ఆనంద్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని నాయకులు స్పష్టం చేశారు.

 

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :