పరిపాలన చేతకాక సీట్ అక్రమ కేసులు కబర్దార్ రేవంత్ రెడ్డి ప్రజలు అన్ని గమనిస్తున్నారు తగిన గుణపాఠం చెప్తారు…
– మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి
నారాయణ ఖేడ్, డైలీ రిపోర్ట్ ఫిబ్రవరి 1: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు మేరకు నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మరియు బి ఆర్ ఎస్ నాయకులు కార్యకర్తలు
మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మాట్లాడుతూ…
కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని
పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మున్సిపాలిటీ నాయకులు, నాయకులు, బిఆర్ఎస్వి నాయకులు, యువత, సోషల్ మీడియా వారియర్స్, కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.









