నాగల్ గిద్ద, డైలీ రిపోర్ట్ , ఫిబ్రవరి 2: నాగల్ గిద్ద మండల కేంద్రంలోని నాగలిగిద్ద వివిధ గ్రామాల్లో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఫోన్ టాపింగ్ నోటీసు ఇవ్వడాని నిరాశిస్తూ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం కార్యక్రమం చేపట్టారు మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి ఆదేశానుసారం మండల కేంద్రంలో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ సందర్భంగా మండల సీనియర్ నాయకులు శ్రీధర్ రావు పాటిల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నికల సమయంలో టిఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం గుర్తుకొస్తుందా? అని ప్రశ్నించి మండిపడ్డారు. రాజకీయంగా ఎదగలేకనే ప్రతిసారి వన్ టాపింగ్ కేసు పేరుతో సీట్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు శ్రీధర్ రావు పాటిల్, సునీల్ పాటిల్, శ్రీకాంత్ ,మండల సోషల్ మీడియా అధ్యక్షులు సూర్య ప్రకాష్ రెడ్డి, మాజీ కో ఆప్షన్ సభ్యులు రషీద్ తదితరులు పాల్గొన్నారు.









