తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం: కౌన్సిలర్‌గా ట్రాన్స్‌జెండర్ ఘన విజయం…కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ట్రాన్స్ జెండర్ గెలుపొందారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ 1వ వార్డులో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) 109 ఓట్ల మెజారిటీతో కౌన్సిలర్‌గా గెలుపొందారు.       నల్గొండ ,డైలీ రిపోర్ట్ ;
తెలంగాణలో మున్సిపల్ రాజకీయ చరిత్రలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ట్రాన్స్‌జెండర్ విజయపతాకం ఎగురవేశారు. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నాగిళ్ల కావేరి సుధాకర్ ఘన విజయం సాధించారు. అంతేకాదు ఏకంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిళ్ల కావేరి సుధాకర్ కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన సీపీఎం అభ్యర్థి నగేశ్‌పై 109 ఓట్ల ఆధిక్యంతో కౌన్సిలర్‌గా ఎన్నికవ్వడం సంచలనంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ చారిత్రాత్మక విజయంపై రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు అభినందనలు తెలియజేశారు. ట్రాన్స్‌జెండర్ సమాజానికి రాజకీయ గుర్తింపు పెరగడం ప్రజాస్వామ్యానికి శుభసూచకమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ట్రాన్స్‌జెండర్ గెలుపు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఒక చారిత్రాత్మక విజయం నమోదు అయ్యింది. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో సామాజిక అడ్డంకులను అధిగమించి ఓ ట్రాన్స్‌జెండర్ ఘనవిజయం సాధించి చరిత్ర సృష్టించారు.చిట్యాల మున్సిపాలిటీలోని 1వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నాగిళ్ల కావేరి సుధాకర్ (ట్రాన్స్‌జెండర్) కౌన్సిలర్‌గా విజయం సాధించారు. కాంగ్రెస్, సీపీఎం పార్టీలు బలపరిచిన అభ్యర్థి నగేశ్‌పై ఘటన విజయం సాధించింది. 109 ఓట్ల ఆధిక్యంతో ట్రాన్స్ జెండర్ ఘన విజయం సాధించడం సంచలనంగా మారింది. ఒక ట్రాన్స్‌జెండర్ కౌన్సిలర్‌గా గెలుపొందడం తెలంగాణ రాష్ట్రరాజకీయాల్లోనే ఇదే తొలిసారి కావడం విశేషం. కేవలం సామాజిక గుర్తింపు కోసమే కాకుండా, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతోనే పోటీ చేసిన నాగిళ్ల కావేరి(సుధాకర్)ను వార్డు ఓటర్లు పార్టీలకు అతీతంగా ఓటు వేయడం సంచలనంగా మారింది.
ప్రజలకు రుణపడి ఉంటా: కౌన్సిలర్ కావేరి సుధాకర్
చిట్యాల 1 వ వార్డు శివనేనిగూడెం గ్రామానికి చెందిన నాగిళ్ల కావేరి (సుధాకర్) గెలుపొందడంతో చిట్యాలలో సంబరాలు మిన్నంటాయి. తోటి ట్రాన్స్‌జెండర్లు, స్థానిక ప్రజలు కావేరి సుధాకర్‌ను పూలమాలలతో సత్కరించారు.‘ఈ గెలుపు ట్రాన్స్‌జెండర్ సామాజిక వర్గానికి దక్కిన గౌరవం. నాపై నమ్మకం ఉంచిన వార్డు ప్రజలకు రుణపడి ఉంటాను’అని ట్రాన్స్ జెండర్ కౌన్సిలర్ కావేరి సుధాకర్ అన్నారు.మరోవైపు సామాజిక వర్గాలకు అతీతంగా ఆమెకు రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడంటూ చిటీలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన సత్తా చాటింది. కాంగ్రెస్ గెలుపు ముందు బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బోసిపోయాయి. కొన్ని జిల్లాలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసేసింది. సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలను లెక్కిస్తున్న సమయంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓట్లు లెక్కిస్తున్న పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ బాక్సులో ఓ లేఖ ప్రత్యక్షమైంది. సూర్యాపేటలోని 47వ వార్డు బ్యాలెట్ బాక్స్ తెరవగా అందులో నుంచి ఓ లేఖ బయటపడింది. ఆ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ రిటైర్డ్ ఉద్యోగి తాము ఎదుర్కొంటున్న కష్టాల గురించి వివరించారు. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన ఏ ఒక్క పైసా కూడా తమకు రాలేదని ఇప్పటికైనా తమ డబ్బులు తమకు ఇవ్వాలని కోరుతూ రిటైర్డ్ ఉద్యోగి ప్రభుత్వాన్ని విజ్క్షప్తి చేశాడు. ‘ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా..! మేము రిటైర్ అయి 15 నెలలు గడిచింది. మాకు రావాల్సిన, మీరు చెల్లించాల్సిన ఏ ఒక్క పైసా మాకు రాలేదు. ఇవ్వలేదు. అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతూ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 62 మంది విశ్రాంత ఉద్యోగులు చనిపోయారు. అందుకే బాధతో మేము చనిపోక ముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం’అంటూ రిటైర్డ్ ఉద్యోగి ఆ బహిరంగ లేఖలో తన ఆవేదన వ్యక్తం చేశారు.
రోడ్ విస్తరణ బాధితుల చిటీలు
మరోవైపు ఇదే సూర్యాపేట పట్టణంలోని 48వ వార్డు బ్యాలెట్ బాక్స్‌లో చీటీలు కలకలం రేపాయి. బ్యాలెట్ పేపర్ తో పాటు 49 చీటీలు లభ్యమయ్యాయి. మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓటర్లు చీటీలు బ్యాలెట్ బాక్స్ లో వేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చిటీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :