కల్లుగీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న జరిగే నిరాహార దీక్షను జయప్రదం చేయండి. జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్
సంగారెడ్డి బ్యూరో, డైలీ రిపోర్ట్:
సంగారెడ్డి లోని ప్రజా సంఘాల కార్యాలయంలో. జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ కలిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కల్లు గీతా కార్మికులకు గౌడ సోదరులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని. బడ్జెట్లో గౌడ కులస్తుల సంక్షేమం కోసం గీత కార్మికుల ఉపాధి కోసం 5000 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ఈనెల 17న హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష నిర్వహించడం జరుగుతుందని ఈ యొక్క నిరాహార దీక్షకు జిల్లా లోని గౌడ సోదరులు గీతా కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని. ఇచ్చినవారికి 4000 పెన్షన్ చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని.. దరఖాస్తు చేసుకున్న గీత కార్మికులందరికీ కొత్త పెన్షన్ మంజూరు చేయాలి. పెండింగ్ లో ఉన్న ఎనిమిది వందల మందికి సుమారు 14 కోట్ల ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని. గత బడ్జెట్లో కేటాయించిన 70 కోట్ల నిధులను వెంటనే విడుదల చేసి ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గీత కార్మికుల ఉపాధి కోసం గౌడ కులస్తుల సంక్షేమం కోసం జరిగే ఈ నిరాహార దీక్షలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.









