త్వరలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ.. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

జమ్ము కాశ్మీర్ ,డైలీ రిపోర్ట్ ;

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ తెలిపారు. ఇది చాలా సున్నితమైన అంశమని, అయితే ఈ ప్రక్రియకు కేంద్ర కట్టుబడి ఉందని చెప్పారు.

 జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే విషయంలో త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ (Arjun Ram Meghwal) తెలిపారు. శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్‌లో మంగళవారంనాడు మీడియాతో మంత్రి మాట్లాడుతూ, ఇది చాలా సున్నితమైన అంశమని, అయితే ఈ ప్రక్రియకు కేంద్ర కట్టుబడి ఉందని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని హోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే లోక్‌సభలో హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :