పార్టీ పేరులో తెలంగాణ ఉంటుంది ; కవిత

జూబ్లీహిల్స్ ,డైలీ రిపోర్ట్ ;

 మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కోసం కవిత ప్రెస్‌మీట్ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కొత్త పార్టీ ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీని ప్రకటించడం జరిగింది.

పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని కవిత అన్నారు. ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయాలనుకుంటున్నాను. మొదటి ఛాయిస్‌ సిద్దిపేట, రెండో ఛాయిస్‌ బోధన్‌ అన్నారు. కవిత గత కొన్నిరోజులుగా ‘జనం బాట’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆమె మద్దతుదారులను ఏఐబీఎఫ్ పార్టీ బీ-ఫామ్‌పై పోటీ చేయించి తమ ఉనికిని చాటుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :