పరిమితికి మించి సీలింగ్ భూమి కలిగి ఉన్న పార్థసారథి భూముల్ని పేదలకు పంచాలి* *బీఎంపీ పార్టీ వికరాబాద్ జిల్లా అధ్యక్షులు ఘట్య నాయక్ డిమాండ్

పరిగి ,డైలీ రిపోర్ట్, మార్చి05:

దేవాలయ భూములను అన్యాక్రాంతం చేయడమే కాకుండా, అక్రమంగా పరిమితికి మించి సీలింగ్ భూముల్ని కలిగి ఉన్న పార్థసారథి భూముల్ని భూమి లేని పేదలకు పంచాలని బిఎంపీ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ పాత్లావత్ ఘట్ట్య నాయక్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంజీవ స్వామి ఆలయానికి వంశ పారంపర్యంగా ధర్మకర్తలుగా ఉన్నామని చెప్పుకుంటూనే గుడి శిధిలావస్థలో ఉండగా కనీసం ధూప దీప నైవేద్యాలను కూడ పట్టించుకోకుండా ఇన్నిరోజులు తాత్సారం చేసి, ఇప్పుడు తగుదునమ్మా అంటూ నేను ఇది చేశా అధి చేశా అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన సంజీవ స్వామి జాతర మహోత్సవాలు నేడు వెల వెల పోవడానికి కారణం ప్రజలా లేక ధర్మకర్తల అనేది ఆ స్వామికే తెలుసని అన్నారు. ఇప్పటివరకు ఏ రోజు కూడ ధర్మకర్తల సమావేశం నిర్వహించి గుడి బాగుకోసం ఏం నిర్ణయాలు తీసుకున్నారో పార్థసారథి గారికి తప్ప మిగతా వారికి తెలుసో లేదో అన్నారు. ఇదంతా ఒక ఎత్తయితే వారు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్వయంగా వారి నోటివెంట మాకు 1400 ఎకరాల సీలింగ్ భూమి ఉంది అని పచ్చి నిజం మాట్లాడటం ప్రజలందరూ ఇప్పటికే గమనించారని అన్నారు. 1970 -73 సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక కుటుంబానికి 50 ఎకరాకు మించి భూమి ఉండొద్దని ఉన్నది తనకు తెలియదా అని ప్రశ్నించారు. కుటుంబంలో 5 మంది సభ్యులు ఉంటే 10 – 18 ఎకరాల మాగాణి 60 ఎకరాల లోపు మెట్ట ఉండొచ్చు అని యాక్ట్ చెబుతుందని ఈ లెక్కన 1400 ఎకరాల భూమి ఎలా సమకూరిందని ప్రశ్నించారు. ఇలా అయితే సంజీవ స్వామి ఆలయ భూములు కూడ స్వాహా అయ్యాయేమో అనే అనుమానం తన స్టేట్మెంట్ విన్నాక ఎవరికైనా కలుగుతుందని అన్నారు. తక్షణమే ప్రభుత్వ యంత్రంగా ఈ విషయంలో జోక్యం చేసుకొని దర్యాఫ్తు చేసి ఆలయానికి ధర్మకర్తలుగా గ్రామస్తులనే నియమించాలని దానితోపాటు పార్థసారథి గారి భూమి వివరాలు లెక్కలు తీసి అక్రమంగా ఉన్న, పరిమితికి మించి ఉన్న భూముల్ని ప్రభుత్వం భూమి లేని పేదలకు పంచాలని డిమాండు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :