జిల్లా ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు – జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య

 

సంగారెడ్డి బ్యూరో అక్టోబర్ 01

(డైలీ రిపోర్ట్):

విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ,జిల్లా ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగ ప్రతి ఇంటిలో ఆనందోత్సాహాలను నింపాలని, చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆమె ఆకాంక్షించారు. మాత దుర్గాదేవి కృపతో అందరూ ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో జీవించాలని కలెక్టర్ కోరారు. ఈ విజయదశమి ప్రతి ఒక్కరికి విజయాలు చేకూర్చాలని అభిలాషించారు. అందరూ శాంతియుత, ఆనందోత్సాహాల మధ్య దసరా పండుగను జరుపుకోవాలని ఆమె సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :