-
-
తమిళనాడులో తీవ్రమవుతున్న రాజకీయ వివాద
-
-
కరూర్ తొక్కిసలాట ఘటనపై నటుడు విజయ్‌పై ఉదయనిధి ఫైర్
-
41 మంది మృతికి విజయే ప్రధాన బాధ్యుడంటూ పరోక్ష ఆరోపణలు
-
ఈ ఘటనపై ఇప్పటికే కొనసాగుతున్న సీబీఐ విచారణ
-
విజయ్‌ను నియంత్రించేందుకే బీజేపీ కుట్ర అని డీఎంకే విమర్శ
-
డీఎంకే, టీవీకే మధ్య పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు
డైలీ రిపోర్ట్ ,తమిళనాడు ;
ఈ ఘటనపై ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ “కరూర్‌లో జరిగిన దానికి అందరూ బాధ్యులే, కానీ ఒకరు మాత్రం అత్యంత ప్రధాన బాధ్యులుగా ఉన్నారు” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో ఆయన నేరుగా విజయ్‌ను ఉద్దేశించారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ ర్యాలీలోనే ఈ విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తోంది. అయితే, విజయ్‌ను రాజకీయంగా నియంత్రించేందుకే బీజేపీ ప్రభుత్వం సీబీఐని రంగంలోకి దించిందని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ దుర్ఘటన జరిగినప్పటి నుంచి డీఎంకే నేతలు విజయ్, ఆయన పార్టీ టీవీకేను బాధ్యులను చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
తాజాగా ఉదయనిధి చేసిన వ్యాఖ్యలతో అధికార డీఎంకే, కొత్తగా ఏర్పాటైన టీవీకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. ఈ ఆరోపణలు తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.









