జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌పై కేసు

జూబ్లీహిల్స్ డైలీ రిపోర్ట్ ;

జూబ్లీహిల్స్​ కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్​ (Naveen Yadav)పై కేసు నమోదైంది. బీఆర్​ఎస్ (BRS)​ నాయకుల ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు కేసు నమోదు చేశారు.

జూబ్లీహిల్స్​ ఉప ఎన్నిక మరో తొమ్మిది రోజుల్లో జరగనుంది. ఈ ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే రెండు పార్టీలో ప్రచారంలో దూసుకు పోతున్నాయి. అయితే ఇరు పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదులు సైతం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ క్యాడర్‌ను లేకుండా చేస్తానంటూ ఇటీవల కాంగ్రెస్​ అభ్యర్థి నవీన్​ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని బీఆర్​ఎస్​ నేతలు ఫిర్యాదు చేశారు. నవీన్​ యాదవ్​తో పాటు ఆయన సోదరుడు వెంకట్ యాదవ్‌పై కూడా కేసు నమోదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై బీఆర్​ఎస్​ నేతలు ఎన్నిక​ల అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు బోరబండ పీఎస్​ (Borabanda Police Station)లో ఫిర్యాదు చేయడంతో మూడు కేసులు నమోదు అయ్యాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :