రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం బస్సు లారీ ఢీ

చేవెళ్ల, డైలీ రిపోర్ట్

 

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సును లారీ ఢీకొంది. ఢీకొన్న తర్వాత బస్సుపై బోల్తా పడింది టిప్పర్ లారీ. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్పాట్‌లో లారీ డ్రైవర్ మృతి చెందగా.. అతని డెడ్ బాడీ ఇరుక్కుపోయింది. గాయపడిన వారిని చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు.

 

హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై ఈ ఘటన జరగగా… చేవెళ్ల-వికారాబాద్‌ రూట్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో తాండూర్ డిపో బస్సు ప్రమాదానికి గురైంది. లారీలో ఉన్న కంకర పడటంతో బస్సులో ప్రయాణికులు కూరుకుపోయారు. బస్సులో చిక్కుకున్న వారిని సహాయ సిబ్బంది బయటకు తీస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :