రహదారిపై గుంతను తప్పించబోయి – బస్సును ఢీకొట్టిన లారీ

రంగారెడ్డి బ్యూరో చీఫ్ ,డైలీ రిపోర్ట్ ;                                                                                                                                                                                                     రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది మృతిచెందారు. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో తాండూరు ఆర్టీసీ డిపోనకు చెందిన ఈ బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా ప్రాథమిక సమాచారం. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు : బస్సుపై కంకరలోడు ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. ఈ ప్రమాదంతో హైదరాబాద్​ -బీజాపూర్​ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది. దీంతో వికారాబాద్​ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.

రహదారిపై గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టిన లారీ

రహదారిపై గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టిన లారీ

తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సును ఢీకొట్టిన కంకర లారీ

ఎదురుగా వచ్చి పూర్తిగా ఆర్టీసీ బస్సుపైకి ఒరిగిన కంకర లారీ

బస్సులోని ప్రయాణికులపై పడిన లారీలో ఉన్న కంకర

బస్సులో పడిన కంకర కింద కూరుకుపోయిన ప్రయాణికులు

కంకరతో బస్సు నిండడంతో అతికష్టంగా మారిన సహాయచర్యలు

మూడు జేసీబీల సహాయంతో కొనసాగుతున్న సహాయ చర్యలు

హైదరాబాద్‌-బీజాపూర్‌ జాతీయరహదారిపై రోడ్డు ప్రమాదం

చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్

రంగారెడ్డి: ప్రమాదానికి గురైన తాండూరు డిపో బస్సు

పటాన్‌చెరు లక్డారం క్రషర్‌ నుంచి వికారాబాద్‌ వైపు వెళ్తున్న లారీ

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :