‘మీ విజయం కోట్లాది మందికి స్ఫూర్తిమంత్రం’- ప్రపంచకప్​ విజయంపై ప్రధాని మోదీ

ఢిల్లీ బ్యూరో ,డైలీ రిపోర్ట్ ;

Modi on Women World Cup Win : భారత మహిళల క్రికెట్ టీమ్ ఘన విజయం దేశంలోని కోట్లాది మందిలో స్ఫూర్తిని రగులుస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. యావత్ దేశం మన టీమ్‌ను చూసి గర్విస్తోందన్నారు. ఈ సదస్సు సైన్స్‌ది అయినప్పటికీ, తాను తొలుత భారత మహిళల క్రికెట్ టీమ్ విజయం గురించే మాట్లాడుతానని ప్రధాని అన్నారు. తొలి మహిళా ప్రపంచ కప్‌ను భారత్ కైవసం చేసుకోవడాన్ని గొప్ప విషయంగా ఆయన అభివర్ణించారు. సోమవారం న్యూదిల్లీలో ‘ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కన్‌క్లేవ్’ (ఈఎస్‌టీఐసీ) సదస్సు వేదికగా ప్రధానమంత్రి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :