మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమా? ఈ క్రెడిట్ కార్డ్స్​తో ఫ్లైట్స్​​, హోటెల్​ బుకింగ్స్​పై భారీ డిస్కౌంట్స్​! విహారయాత్రలు, ప్రయాణాలు చేసేవారి కోసం స్పెషల్ క్రెడిట్ కార్డ్స్​- ఇవి ఉంటే మీకు భారీగా డబ్బులు ఆదా కావడం గ్యారెంటీ!

డైలీ రిపోర్ట్ ఇంటర్నెట్ డెస్క్ ;

Credit Cards For Travel Freaks : మీకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమా? ఇందుకోసం మీరు పెద్ద బడ్జెట్ వేసుకున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కొన్ని క్రెడిట్ కార్డులు వాడితే చాలు. మీ బడ్జెట్​లో ఏకంగా 25 శాతం తగ్గితుంది. సూపర్​ కదా!

విహారయాత్రలు చేసేవారికి, తరచుగా ప్రయాణాలు చేసేవారి కోసం ప్రస్తుతం మార్కెట్లో చాలానే క్రెడిట్ కార్డులు ఉన్నాయి. వాటిలో 5 బెస్ట్​ క్రెడిట్ కార్డుల గురించి ఈ ఆర్టికల్​లో మనం తెలుసుకుందాం.

1. ఐసీఐసీఐ బ్యాంక్ మేక్​మైట్రిప్ క్రెడిట్ కార్డ్ : ఈ కార్డుదారులు జాయినింగ్ ఫీజు చెల్లించిన తర్వాత రూ.1000 విలువ చేసే మేక్​మైట్రిప్ వోచర్​ ఇస్తారు. దీనిని ఒక ఏడాదిలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు. అలాగే వార్షిక రుసుము చెల్లించిన తరువాత ఇలాంటిదే మరో వోచర్ అందిస్తారు. దానిపై కూడా బోలెడు ఆఫర్లు ఉంటాయి.

ఈ క్రెడిట్ కార్డు ఉపయోగించి ఈజీమైట్రిప్​ ద్వారా ఫ్లైట్​ టికెట్స్​ బుక్ చేసుకుంటే, మీకు ఏకంగా 10 శాతం ఇన్​స్టాంట్ డిస్కౌంట్​ లభిస్తుంది. హోటల్ బుకింగ్స్​పై 20 శాతం తక్షణ తగ్గింపు ఉంటుంది. ఇక అంతర్జాతీయ లావాదేవీల విషయానికి వస్తే కేవలం 0.99 శాతం ఫారెక్స్ మార్కప్ మాత్రమే ఉంటుంది.

2. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ 6ఈ రివార్డ్స్​ ఎక్స్​ఎల్​ ఇండిగో క్రెడిట్ కార్డ్ : ఇది ఒక కో-బ్రాండెండ్ క్రెడిట్ కార్డు. ఈ కార్డు ఉయోగించి వెబ్​సైట్​ లేదా యాప్ ద్వారా ఇండిగో ఫ్లైట్​ టికెట్స్​ బుక్ చేస్తే 6ఈ రివార్డుగా 5 శాతం తిరిగి వస్తుంది. అంతేకాదు అకోర్ హోటల్​ స్టేకు సంబంధించి రూ.5,000 విలువైన ఓ ఓచర్ లభిస్తుంది.

3. అమెరికన్​ ఎక్స్​ప్రెస్ ప్లాటినమ్​ ట్రావెల్ క్రిడెట్ కార్డు : ఈ కార్డుతో ఒక ఏడాదిలోపు రూ.1.9 లక్షలు ఖర్చు చేస్తే 15,000 మెంబర్​షిప్​ రివార్డ్ పాయింట్స్ లభిస్తాయి. వీటిని ప్లాటినమ్ ట్రావెల్ కలెక్షన్ లేదా అమెక్స్​ ట్రావెల్ ఆన్​లైన్​లో రిడీమ్​ చేసుకోవచ్చు. ఒక వేళ మీరు ఈ కార్డుతో ఒక ఏడాదిలో రూ.4 లక్షలు ఖర్చు చేస్తే, మీకు 25,000 మెంబర్​షిప్​ రివార్డ్​ పాయింట్లు పొందుతారు.

4. యాక్సిస్ బ్యాంక్ అట్లాస్​ క్రెడిట్ కార్డు : ఈ కార్డు ఉపయోగించి ట్రావెల్ ఎడ్జ్​ పోర్టల్​లో విమానం టికెట్లు బుక్​ చేస్తే ప్రతీ రూ.100కు 5 ఎడ్జ్​ మైల్స్​ లభిస్తాయి. వీటిని మీరు 1:1 నిష్పత్తిలో రిడీమ్ చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఈ కార్డుతో హోటల్​ బుకింగ్స్ చేస్తే ప్రతీ రూ.100కు 2.5 ఎడ్జ్​ మైల్స్​ వస్తాయి.

5. ఏయూ స్మాల్​ ఫైనాన్స్​ బ్యాంక్​ ఇక్సిగో క్రెడిట్ కార్డ్​ : ఈ కార్డు ఉన్నవారు ఇక్సిగో యాప్ లేదా వెబ్​సైట్ ద్వారా విమానం టికెట్లు బుక్​ చేసుకుంటే 10 శాతం డిస్కౌంట్ ఇస్తారు. అంతేకాదు హోటల్ బుకింగ్స్​పై కూడా 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

నోట్​ : క్రెడిట్ కార్డులను అవసరమైన ఖర్చుల కోసమే ఉపయోగించాలి. కేవలం రివార్డులు, డిస్కౌంట్లు, ఆఫర్ల కోసం వాటిని విచ్చలవిడిగా వాడితే, అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. ఈ ఆర్టికల్​లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది మీరు గమనించాలి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :