శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం

డైలీ రిపోర్ట్ ,క్రైమ్ బ్యూరో శంషాబాద్ ,జనవరి 23;శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ కలకలం రేపింది. తిరుపతి నుంచి శంషాబాద్ వచ్చిన ఓ వ్యక్తి బ్యాగ్‌లో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. దానిని స్వాధీనం చేసుకున్న అనంతరం.. విచారణ నిమిత్తం ఆ వ్యక్తిని ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు.

గతేడాది అక్టోబర్‌లోనూ కోల్‌కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రయాణికుడి వద్ద సెక్యూరిటీ అధికారులు బుల్లెట్‌ను గుర్తించారు. ఆ ప్రయాణికుడిని విశాల్‌గా గుర్తించారు. అతడి బ్యాగ్‌లో 38 ఎంఎం బుల్లెట్ లభ్యమైంది. విశాల్‌ను అదుపులోకి తీసుకున్న సెక్యూరిటీ అధికారులు.. అతడిని పోలీసులకు అప్పగించారు.

 

శంషాబాద్ విమానాశ్రయం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. వివిధ దేశాలు, రాష్ట్రాలకు వెళ్లే సాధారణ ప్రయాణికులు, వీఐపీలు ఎయిర్‌పోర్టుకు వస్తుంటారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టులో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతీ ప్రయాణికుడి బ్యాగ్‌లను భద్రతా సిబ్బంది తనిఖీలు చేస్తుంటారు. తనిఖీల సందర్బంగా డ్రగ్స్, బంగారం, ఆయుధాలు బయటపడుతూ ఉంటాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :