మెదక్ ,డైలీ రిపోర్ట్ ;మెదక్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పదవి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి. చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న 14 మంది కౌన్సిలర్లతో పాటు బీఎస్పీ 1, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఎక్స్ అఫీషియో ఓటుతో చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. ముందుగా 32 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేపట్టారు తర్వాత నిర్వహించిన చైర్మన్ ఎన్నికలకు 24వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానుగు రాధిక మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా 20వ వార్డు కౌన్సిలర్ మన్సూర్ ప్రతిపాదించారు. వారి ప్రతి పాదనను 19వ వార్డు కౌన్సిలర్ గంట సంపత్ బలపరిచారు.కాంగ్రెస్ పార్టీ తరఫున 14 మంది కౌన్సిలర్లు ఒక బీఎస్పీ కౌన్సిలర్ ఎక్స్ అఫీషియో సభ్యుడు ఎమ్మెల్యే రోహిత్ రావు చేతులెత్తి బలపరిచారు. బిజెపి సభ్యులు ఎన్నిక సమయంలో లేకపోవడంతో 30 మంది సభ్యులలో ఎమ్మెల్యే ఓటుతో కలిపి 16 ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి రావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందినట్టుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. బిఆర్ఏస్ పార్టీ తరఫున మూడో వార్డు కౌన్సిలర్ కొట్టాల లలితను ఆ పార్టీ కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు ప్రతిపాదించారు. బట్టి ఉదయకుమార్ బలపరిచారు, వారికి సరిపోయిన అన్నిఓట్లు లేకపోవడంతో ముందుగా 16 ఓట్లు వచ్చిన కానుగు రాధిక ను మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైనట్లుగా అధికారులు ప్రకటించారు.అనంతరం బిఆర్ఎస్ కౌన్సిలర్లు సమావేశ మందిరం నుండి బయటకు వెళ్లిపోయారు. కోరం ఉన్నందున వైస్ చైర్మన్ ఎన్నికను ఎన్నికల అధికారులు చేపట్టారు వైస్ చైర్మన్ అభ్యర్థిగా దొంతి నరేష్ గౌడ్ ను అరుణార్థి వెంకటరమణ ప్రతిపాదించారు. తోడుపునూరి శివరామకృష్ణ బలపరిచారు. దీంతో వైస్ చైర్మన్ గా దొంతి నరేష్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్ కానుగు రాధిక, దొంతి నరేష్ గౌడ్ లను ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఘనంగా సత్కరించారు. రాబోయే రోజుల్లో మెదక్ పట్టణాన్ని అభివృద్ధి చేసి చూపుతామని తెలిపారు.









