నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకొని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రకరణ్ ను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు

సంగారెడ్డి బ్యూరో, (డైలీ రిపోర్ట్):

నేషనల్ సైన్స్ డే ను పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ వెంకటేశ్వర్లు గారు కంది మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంద్రకరణ్ ను ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనను తిలకించి విద్యార్థులను అభినందించారు. దేశ అభివృద్ధిలో విజ్ఞాన శాస్త్రం ఎంతో ముఖ్యమైనదని ప్రభుత్వం సూచించిన మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ వంటి కార్యక్రమాలు విజయవంతం అవ్వాలంటే సైన్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహనను కలిగి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేశారు .

అదేవిధంగా 6 నుండి 9వ తరగతి విద్యార్థుల తరగతులను పరిశీలించారు. ఉపాధ్యాయులు పాఠ్య ప్రణాళికలు డైరీ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతిని సందర్శించి విద్యార్థులతో ముఖాముఖిగా చర్చించారు. విద్యార్థులతో మ్యాప్ పాయింటింగ్ వంటి అంశాలను IFB పానెల్ బోర్డు ఉపయోగించడం ద్వారా అడిగి తెలుసుకున్నారు రాబోయే వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని, గత సంవత్సరం మాదిరిగానే త్రిబుల్ ఐటీ బాసరలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు సీట్లు పొందాలని తెలియజేశారు. పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించడానికి ఉత్తమమైన సలహాలను సూచనలను అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

Share :